వరి సాగుకు ప్రత్యామ్నాయంగా పంట మార్పిడి చేయండి.. రామాయంపేట రైతులకు వ్యవసాయ అధికారుల సూచన!
రైతు వేదికలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం.. నేల ఆరోగ్యం, నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన.
Narender
ప్రచురణ: 2 నవంబర్ 2026, సాయంత్రం 6:05
సవరణ: 2 నవంబర్ 2026, సాయంత్రం 7:23
నిలుపుదల గడువు: ఇంకా 15 రోజులు

రామాయంపేట: రైతులు పంటల మార్పిడిని ప్రోత్సహిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘ఖేత్ బచావో అభియాన్’ (KBA) కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా యాసంగి సీజన్లో వరి పంటకు బదులుగా స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలను సాగు చేయాలని అధికారులు రైతులకు సూచించారు. నేల పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించడం, సమతుల్య ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, పంట అవశేషాల నిర్వహణ, పంటల వైవిధ్యీకరణ, నీటి సంరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.



